రాసీరాసేను-12: శుక్రవారం సాయంత్రం
ఉందింకా ముప్పావు గంట
కానీ మనసేమో ఇంటి దారి వెంట
చూపులేమో గేటు వంక
మేనేజరు చూస్తాడేమో అని శంక
ఈ ఆఫీసు పనొక తుమ్మ బంక
ఉన్నా లేకున్నా, అదొక జిగురు జింక
అబ్బో! ఈ ఆఫీసొక పెద్ద లంక
సమయమెంతకీ కదలదేం ఇంకా
అన్న నిట్టూర్పులే నాకిక పంఖా
నేను మ్రోగించానా ... Continue Reading
No Comments
రాసీరాసేను-11 : స్వల్ప విరామం తరువాత
కొన్ని రోజుల గ్యాపు
ఎందుకంటే మధ్యలో వేశాను న్యాపు
ఈ ఐడీకి కప్పేశా క్యాపు
ఈసైటుకి వచ్చే మ్యాపు
దానికిచ్చేసా నా ల్యాపు
సర్దుకుని పదుకుంది - అదో ఆసక్తికరమైన జాపు
లేచాక కలిసి ఆడాము ర్యాపు
ఒంట్లోని ఓపికంతా దానితో స్యాపు
అయినా ఇదొక కొత్త హ్యాపు
ఎక్కడెక్కడెక్కడోయ్ ట్యాపు
అబ్బో! అక్కడొస్తున్నాడో కాపు
ఇంకిక్కడొద్దు ... Continue Reading
No Comments
రాసీరాసేను-10 : ‘న’కారపు రాత్రుళ్ళు
చీకటి రాత్రుళ్ళ వానా
సెల్లు రేడియోలో గానా
దీపం వెలుతురులో ఖానా
అయినా మెదడు ఎప్పట్లాగే కార్ఖానా
దానిలోపలి గల్లీల్లో జానా
జ్ఞాపకాల మలుపుల్లో ఖోనా
అమ్మ అదిలింపులకి ఈలోకంలోకి వాపస్ ఆనా
పిమ్మట అక్షింతల పానా
ఓయ్, ఎక్కడ్నున్నావోయ్ నానా
నువ్వు పిలిచావంటే నేను రానా
తమిళంలో ఏనుగు యానా
నిద్రా, బంగారం ఏదైనా మనకు ... Continue Reading
No Comments
రాసీరాసేను 9: అంత్య ప్రాసల జిడ్డు
అంత్యప్రాసల జిడ్డు
వదలక తింటోంది హెడ్డు
నా మెదడే కాబోలు దాని బ్రెడ్డు
బిగిసిన పిడికిళ్ళతో మీ మొహం రెడ్డు
ఇక నాపై మీ దాడినాప నావద్ద లేదు తెడ్డు
అయినా ఏం చేస్తాం మీ కోపాలే నా ఫుడ్డు
అపుడే చిన్ని నా బొజ్జకు వెరీ గుడ్డు ... Continue Reading
1 Comments
రాసీరాసేను 8: అతను
అతను ఆలోచనల్లో కింగు
చేసేది డబ్బాకవతల థింకింగు
అని అతనితో సహా కొందరి ఫీలింగు
ఆపై ఆలోచనల్ని పట్టుకునేందుకు జంపింగు
పట్టుకున్నాక ఆనందంలో డాన్సింగు
పాతకాలపు పెన్నీ షిల్లింగు
లతో వెళ్ళిపోవాలని బీజింగు
ఇతగాడి మెగా ప్లానింగు
అవకాశాలకోసం జీవితకాలం వెయిటింగు
ఒక్కసారైనా వచ్చిందాన్ని చేస్కోడు సేవింగు
జీవితం చేతుల్లో తింటూంటాడు బీటింగు
అయినా మారడు ఇతగాడో ... Continue Reading
No Comments
రాసీరాసేను-7 మీటింగులు
శుభమా అని శుక్రవారం వస్తే - మీటింగని గంటలగ్గంటలు కూర్చోబెడితే ఎలా!
ఈ మీటింగులున్నాయే మీటింగులు
వీటికంటే నయం వీథి బోరింగులు
అయ్యుంటే ఇవన్నీ డేటింగులు
జీవితమంతా ఇక ఎంజాయింగులు
వీటికోసం తిండి ఎగ్గొట్టి చేస్తాం డైటింగులు
లేటవకూడదని చేస్తాం మరెన్నో ఫైటింగులు
కానీ, మీటింగులు ఉత్త కోటింగులు
పైపై మెరుగులతో షూటింగులు
మన ... Continue Reading
No Comments
రాసీరాసేను-6: రాసీ విప్లవకారిణి
నెలరోజులుగా రాయలేదుకదా - విప్లవం తలకెక్కి జనాన్ని తిడుతూ కూర్చున్నా.
చివరాఖరికి ఈ బుల్లి తిట్టు కవిత తయారుచేశా - ప్రాపగాండా మెటీరియల్ కోసం.
గుంపుల్లో గోవిందయ్య జనం
చేసేదంతా భజనం
ఆపై సామూహిక భోజనం
నువ్వన్నావా నేను ఏక్ నిరంజనం
వెంటనే చేసేస్తారు నిమజ్జనం
నీదగ్గరుందంటివా అంజనం
నీకు పట్టేస్తారు నీరాజనం
ఇలాంటివారున్నారే ... Continue Reading
No Comments
రాసీరాసేను-5: కాఫీ సే కుక్కా తక్
పొద్దున్నే ఒకటిన్నరకు కాఫీ తాగితే? - ఇలా ఉంటుంది నాబోటి వాళ్ళకి -
అదిగదిగో... వచ్చేసింది కాఫీ
ఇక ఈరోజుకి స్వాగతం సాఫీ
అదిగో, ఆ పక్కనుండి సీడీలో రఫీ
రఫీ కాకుంటే ఎవరో ఒక సూఫీ
ఈహాయికేదైనా ఇవ్వగలరా ఫీ
అయ్యా లిబ్యా గడాఫీ
ఎప్పటికయ్యా నీ అధికార మాఫీ
కాఫీ ... Continue Reading
No Comments

