చీకటి రాత్రుళ్ళ వానా
సెల్లు రేడియోలో గానా
దీపం వెలుతురులో ఖానా
అయినా మెదడు ఎప్పట్లాగే కార్ఖానా
దానిలోపలి గల్లీల్లో జానా
జ్ఞాపకాల మలుపుల్లో ఖోనా
అమ్మ అదిలింపులకి ఈలోకంలోకి వాపస్ ఆనా
పిమ్మట అక్షింతల పానా
ఓయ్, ఎక్కడ్నున్నావోయ్ నానా
నువ్వు పిలిచావంటే నేను రానా
తమిళంలో ఏనుగు యానా
నిద్రా, బంగారం ఏదైనా మనకు సోనా






