అఖిలాంధ్రులను దుఖఃసాగరం లో ముంచిన ప్రియతమ నేత వై.యస్.రాజశేఖర రెడ్డి దివ్యస్మృతికి విశాఖనగరం నివాళులు అర్పించేకార్యక్రమం కొనసాగు తూనే ఉంది.ఎన్నో వీధుల్లో,కూడళ్ళలో ప్రజలు,అభిమానులు,కార్యకర్తలు వైయస్ చిత్రపటాల వద్ద ప్రమిదలు వెలిగించి, ఆధ్యాత్మిక,భక్తి గీతాలను ఆలపిస్తూ,ఆలకిస్తూ కాలం గడుపుతున్నారు.
ఆర్టీసి కాంప్లెక్సు సమీపములోని నగరానికి చెందిన ప్రముఖ పుస్తకవిక్రయశాల హిమాంశు బుక్ డిపో వారు శుక్రవారం సాయంత్రం అభినవ ఘంటసాల,వైజాగ్ ఘంటసాల గా పేరొందిన ప్రముఖ గాయకుడు
సూరిశెట్టిరామారావు చే భగవద్గీతాలాపన కార్యక్రమం ఏర్పాటు చేసింది.
అదే విధంగా సెంట్రల్ పాస్టర్స్ కమటీ వారు మునిసిపల్ కార్పోరేషన్ భవనానికి ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద క్రొవ్వొత్తులతో క్రైస్తవమతానుసారంగా ప్రార్ధనలు జరిపారు.
పలు విద్యా,వ్యాపార సంస్థలు తమతమ సముదాయాల వద్ద వైయస్ నిలవెత్తు చిత్రపటాలను పెట్టి వైయస్ అమర్ రహే అంటూ నినాదాల తోరణాలను ఏర్పాటుచేశారు.
ఇది ఇలా ఉండగా తమదివంగత నేత కడసారి చూపు కరకు నగరానికి చెందిన ప్రముఖ నాయకులు
చాలామంది హైదరాబాద్,ఇడుపులపాయకు వెళ్ళినందున వారి తిరిగివచ్చినవెంటనే కాంగ్రెస్ పార్టీ తరపున పలుకార్యక్రమాలు తలపెట్టినట్టుసమాచారం.
విశాఖవీధుల్లో పలుచోట్ల టెలివజన్ ఛానళ్ళు ప్రత్యక్షప్రసారం చేస్తున్న వైయస్ అంత్యక్రియలను శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయేవరకూ చూస్తూ అనేకప్రాంతాలలో ప్రజలు గడిపారు.






