దిమిలి పొడుగు మనిషి గురించి …
మహాపండిత రాహుల్ సాంకృత్యాయన్ రచనలను అనన్యసామాన్య రీతిలో అనువదించి మనకు అందించిన
ఆలూరి భుజంగరావు గారు తన జీవిత చరిత్ర ‘గమనాగనం”లొ
యానాదులు అనే వారు ప్రదర్సించే ఒక కళారూపం గురించి రాసింది చదివితే చాలా మంది మర్యాదస్తులు యాక్ అనో ఇంకోటనో చీదరించుకుంటారు.ఎందుకంటె సాదాసీదా జనాలకూ,సభ్యత సంస్కారాలు ఉన్నాయీ అనుకునేవారికీ వినోదాన్ని అస్వాదించటంలో యోజనాల దూరముంటుంది.సమాజంలో నూటికి తొంభైమంది సగటు ప్రజలు ఉండే మన గ్రామీణప్రాంతాల్లో కాలక్షేపానికి చాలా పరిమితమైన సాధనాలు ఉండేవి.వాటిని వారు ఎంతో పదిలంగా చూసుకుంటూ ఆనందిస్తూ ఆయా కళాకారులను తమ శక్తి మెరకు సంభావిస్తూ ఉండేవారు.
తాను కన్ను మూసి దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ శ్రోతల హృదయాల్లో నిలిచి పోయిన అపురూపమైన కళాకారుడు దిమిలి పొడుగు మనిషి.కాస్త గరగరలాడే గొంతుతో దిమిలి పొడుగు మనిషి పాడిన పాటలు కొన్ని సినిమా పాటలకు ట్యూను వరకూ అనుకరణలే కానీ ప్రతి పాటా ఎంతో హాస్యం,వ్యంగ్యంతో నిండి అంతర్లీనంగా ఒక సందేశం వినిపించేవి.అతనిలో ఆనాటి దురలవాట్లు,సమాజంలోని రుగ్మతలమీద పదిమందికీ ఏదో చెప్పాలనే తపన స్పష్టంగా వినిపిస్తుంది.
.
దిమిలి పొడుగు మనిషి పాటలు కేవలం ఉత్తరాంధ్రకే పరిమతం అనేది అతని పేరు ప్రతిష్టలను తక్కువ చేసి మాట్లాడటమే కాగలదు.నా చిన్న తనంలో మా గుంటూరు జిల్లాలో అతని పాటలు ఎంతబాగా వినేవారంటే ఎక్కడో కధాచిత్తుగా మోగె గ్రామఫోనుల్లో వినీవినీ నాకు అవన్నీ కంఠస్తం అయ్యాయి,రేడియోలొ అతని పాటలు రావు,టేప్ రికార్డర్లు బాగా ధనవంతుల దగ్గర మాత్రం ఉండేవి,అయినా నా ఈడు పిల్లలకు చాలామందికి దిమిలిపొడుగు మనిషి పాటలన్నీ నోటికి వచ్చాయి,ఇప్పటికీ గుర్తున్నాయీ అంటే ఎన్ని వందలసార్లు విని ఉంటామో ఊహించుకోగలరు. రంగూను ఉత్త్రరం,మందులోడి పాట,పెండ్లి పిలుపు,బ్రాకెట్ పాట,కామెడి హరికధ,సిటి బస్,పదకొండు శవాల కధ,పేపరు వార్తలు,ప్రామిసరీ నోటు, రాజమండ్రి పుష్కరం వింత,భిలాయి పాట,సూపర్ మార్కెట్ హాస్యం,తిరుపతి యాత్ర,కొళాయి పాట,సినిమా చిత్రం ఇలా ఉంటాయి అతని పాటలు,వాటి శీర్షికలు.అతని పాటల నుంచి ఒక అప్పారావును ఫెడీల్మని కొట్టడం అనే అంశాన్ని ఎన్ని సినిమాల్లొ నిస్సిగ్గుగా మనాళ్ళు కాపీ కొట్టారో కూడా మనం లెక్కపెట్టలేము.
కేవలం అయిదవ తరగతి వరకే చదువుకున్న దిమిలి పొడుగు మనిషి తన స్వంత రచనలనే రికార్డులుగా అందించి,ఒరిస్సా,పశ్చిమ బెంగాల్,బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడ లెక్కలు మిక్కిలిగా ప్ర్దదర్సనలు ఇచ్చి అక్కడి ఆంధ్రులనూ అలరించి,ఆనందింపజేశాడు.అతను ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా,స్వంతంగా మేకప్ వేసుకునేవాడు,అది కూడా ఒక యూనిఫాం లాంటి దుస్తులు,ఆ దుస్తుల మీద తనకు బహూకరించిన పతకాలను అలంకరింకునేవాడు.అలాగే ఒక ప్లాస్టిక్ ముక్కు,ప్లాస్టిక్ మీసం తో పాటు తమాషా ఐన తలపాగా ధరించేవాడు.ఏవూరు వెళ్ళినా అక్కడి స్థానిక పరిస్తితులు,రాజకీయాలు,ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇలాంటి అంశాలను ప్రస్తావించేవాడు.దిమిలి పొడుగు మనిషికి ఆ నాటిగ్రామీణాభిమానులు ఎంత పారితోషికం ఇచ్చెందుకు సిద్ధపడ్డా తను మాత్రం ఒక్క ఐదు వందలతోనే సరిపెట్టుకునేవాడు.
దిమిలి పొడుగు మనిషికి ఆడగొంతు విషయం లో ఆ దిమిలి గ్రామానికి చెందిన కాసారపు వరహాలు అనే ఒక మహిళ సహకరించేదనీ,తబలా మీద యస్.వీర్రాజు,క్లారినెట్ మీద కేసనకుర్తి దేవుళ్ళు అనే కళాకారులు తోడ్పాటు అందించేవారు.కానీ అతను అందించిన గ్రామఫోను రికార్డులకు మాత్రం బి.గోపాలం సంగీతం అందించగా,యస్.రాజేశ్వరరావు,వి.వి.సుమిత్ర గాత్ర సహకారం అందించే వారు.
ఇంతకూ దిమిలి పొడుగు మనిషిగా పేరుప్రతిష్టలు ఆర్జించిన ఈ అపురూప కళాకారుడి పేరు సురమళ్ళ సంజీవరావు.
ఈ కింది లింకు నొక్కి కానీ మీ బ్రౌజర్ లో అతికించుకుని కానీ దిమిలి పొడుగు మనిషి పాటలు వినవచ్చు.
http://www.hummaa.com/songlistings.php?aid=10719&tp=lyricist&pg=&md=&lg=8&lc=lyricist&artist=Dimili+Podugu+Manishi
నాగమురళి గారు ఈ వషయం లో చాలా సహకరించారు
http://nagamurali.wordpress.com/2007/12/27/%e0%b0%a6%e0%b0%bf%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8a%e0%b0%a1%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%ae%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b7%e0%b0%bf/
ఇటీవల సాక్షి దినపత్రిక వారు ఆదివారం అనుబంధం లో ప్రచురించిన వ్యాసం ఇక్కడ
పాత వ్యాసం దాని గురించి వచ్చిన వ్యాఖ్యానాలు ఇక్కడ చదవగలరు:
http://vizagdaily.co.cc/?p=56







For the last several I am trying to download the private songs of dimili podugu manishi but it is my fate to have them in my collections. several friends of mine were appreciated the songs and I heard them during my childhood. I would like to have them in my collections. I am unable to understand to whom I have to contact for download the songs.