చదవేస్తే ఉన్నమతి పోయింది…
ఎద్దల్లే ఉన్నావ్.. తేలుమంత్రం తెలీదా?…
అరవై ఏళ్ళొచ్చాక అమ్మ అనటం మొదలేశాడని…ఇవీ నాకు అది చదవగానే చటుక్కున గుర్తొచ్చిన సామెతలు.అసలు విషయమేంటయ్యా అంటే..
చాలా రోజులతర్వాత యూనివర్శిటీ కెళ్ళా.ఏ యూనివర్శిటీకి అని అడగక్కండి.మొన్నా మధ్య దాకా వైజాగులో ఒకటే యూనివర్శిటీ.ఇవ్వాళ నాలుగున్నాయి.ఇంకొక నాలుగో పదో వస్తాయని అంటున్నారు.ఆనాలుగింటిలో ఒకదానికెళ్ళా,మంచి ఎండలో.మెట్లెక్కుతూ ఉంటే అద్దాలనోటీసుబోర్డులో నుంచి కొట్టొచ్చినట్టు కనిపిస్తుందీ సర్క్యులర్.కనపడ్డ కాగితమల్లా చదివే గుణం గుడ్డిగా దగ్గరకు నడిపించింది.అదేదో విద్యార్ధి వేతనాలు,ఉపకారవేతనాలకు సంబంధించింది.

సరే అంత పెద్ద అధికారిగారు జారీ చేసినది కదా అసలా అర్ధం కూడా ఒకటేడిసిందేమొనని నిఘంటువుల్లొ వెతికా,ఊహూ,సరేనని అంతర్జాలం మీద పడ్డా,అర్బన్ డిక్షనరీవారు ఇలా అన్నారు.
http://www.urbandictionary.com/define.php?term=bonafied
డిక్షనరీ రిఫరెన్సు వారెమో ఇలా అంటున్నారు.
http://dictionary.reference.com/browse/bonafide
మరి మీరేమంటారో?






