దారితప్పిన పక్షులు
మూలం:రవీంద్రనాధ్ టాగూర్
అనుసృజన:అన్వేషి

1
Stray birds of summer come to my window to sing and fly away.
And yellow leaves of autumn, which have no songs, flutter and fall there with a sigh.
గ్రీష్మంలో మిట్టారే విహంగాలు నా గవాక్షము చేరి
పాటపాడి ఆటలాడి ఎగిరిపోతాయి.
శరత్కాలంలో మాత్రం పండుటాకులు,
పాటలు లేనివై,
రెపరెపలాడుతూ నేలరాలి నిట్టూరుస్తాయి.




